Wednesday, October 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరోడ్లు, భవనాల శాఖ ఈఎన్సీగా మోహన్‌నాయక్‌

రోడ్లు, భవనాల శాఖ ఈఎన్సీగా మోహన్‌నాయక్‌

- Advertisement -
  • పలువురు ఎస్‌ఈలకు పదోన్నతి

    నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
    రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌గా జె మోహన్‌నాయక్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ శాఖ ఆదేశాలు జారీచేసింది. ఈనేపథ్యంలో ఈఎన్సీ మోహన్‌నాయక్‌ సోమవారం రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని హైదరాబాద్‌లోని మంత్రుల సముదాయంలో కలిశారు. తనపై నమ్మకంతో ఈఎన్సీ బాధ్యతలు అప్పగించినందుకు మంత్రికి దన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఎస్‌ఈల నుంచి సీఈలుగా పదోన్నతి పొందిన ఎ కిషన్‌రావు, బి లక్ష్మణ్‌, బి. వెంకటేశ్వర్‌రావు, ఎం.శ్రీనివాస్‌రెడ్డి సైతం మంత్రిని కలిశారు. ఈసందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నమ్మకాన్ని నిలబెట్టాలని అన్నారు. ఆర్‌అండ్‌బీ శాఖ బలోపేతంపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -