- Advertisement -
అమ్మకు సెలవు కావాలి…
గడియారం ముల్లు అయినా ఆగుతుందేమో
అమ్మ కదలని రోజు అసలే లేదంటే నిజం
గ్రైండర్ తిరగడం ఆగిన సందర్భలు ఎన్నో
అమ్మ మాత్రం భూమి తో పోటీ పడుతున్నట్లు
ప్రపంచం అంతా సండే సెలవు వేడుక లో
అమ్మ మాత్రం స్పెషల్ మెనూ ముందట వేసుకుని
బ్రేక్ లేని సర్కస్ ఫీట్లు బతుకు నిండా
బాధ్యతలు భుజాలను దిగి వెళ్లవు కదా
అందరి సంతోషం కోసం అమ్మ పడే శ్రమ కు
కామాలే తప్ప ఫుల్ స్టాప్ కడపటి దినమేనా
వారంలో ఒక రోజు అమ్మ కు సెలవు కావాలి
ఇంకి పోయిన కళ్ళలో
కాసిన్ని కన్నీళ్లు నింపు కోవడానికి అయినా….
- దాసరి మోహన్, 9985309080
- Advertisement -