- Advertisement -
హైదరాబాద్ : ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ పరిశ్రమ స్థానిక ప్రజలకు చేరువవుతున్న తరుణంలో మామ్‌జంక్షన్ సంస్థ హైదరాబాద్ వేదికగా ఎం-పాక్ట్ అవార్డుల పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించింది. ప్రాంతాల వారీగా క్రియేటర్లను గుర్తించే దేశంలోనే మొట్టమొదటి కార్యక్రమం ఇదే కావడం విశేషమని మామ్‌జంక్షన్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్స్ వైస్ ప్రెసిడెంట్ నటాషా గర్యాలి, డానోన్ ఇండియా సీఏఓ ప్రియాంక వర్మ తెలిపారు. నోవాటెల్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. స్థానికంగా, ప్రాంతీయ భాషల్లో తమ కంటెంట్ ద్వారా విశేష ఆదరణ పొందుతున్న తల్లులైన ఇన్‌ఫ్లుయెన్సర్లను గుర్తించి వారిని గౌరవించనున్నారు.
- Advertisement -



