Tuesday, February 17, 2026
E-PAPER
Homeఖమ్మంధనం, రౌడీయిజమే కాంగ్రెస్ ని గెలిపించింది

ధనం, రౌడీయిజమే కాంగ్రెస్ ని గెలిపించింది

- Advertisement -

– బీఆర్ఎస్ నాయకత్వ సమన్వయ లేమి మా ఓటమికి కారణం 
– రాజకీయాల్లో గెలుపోటములు సహజం.
– ప్రజా పక్షాన నిలబడి పోరాడుదాం
– కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో ఆర్ఎస్ శ్రేణులకు తాటి పిలుపు
నవతెలంగాణ – అశ్వారావుపేట 

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ధన బలం, అధికార అండ, కొందరు నాయకుల రౌడీయిజంతో అప్రజాస్వామికంగా వ్యవహరించి విజయం సాధించారు అని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆరోపించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 72 వ పుట్టినరోజు వేడుకలను నియోజకవర్గ కేంద్రం అశ్వారావుపేట లో కాసాని చంద్రమోహన్ –  నాగ శేష పద్మ ల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు.  అనంతరం అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు,బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ వచ్చిన చోట్ల కూడా అనైతిక మార్గాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అబద్ధపు హామీలను అమలు చేయకపోతే భవిష్యత్తులో ప్రజలు తిరగబడతారని ఆయన హెచ్చరించారు.

అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులలో బీఆర్ఎస్ రెండు వార్డులను కైవసం చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, గెలుపొందిన 7,14 వార్డు కౌన్సిలర్లు  కొల్లి రవికిరణ్, డాక్టర్ భూక్యా ఉదయ్ జ్యోతి లకు అభినందనలు తెలిపారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని,ఓటమికి నిరాశ చెందకుండా నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

అశ్వారావుపేట నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన బీఆర్ఎస్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.పార్టీకి అండగా నిలిచిన ప్రతి ఓటరుకు,ముఖ్యంగా మహిళలు,వృద్ధులు, యువతకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని,రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పూర్వ వైభవం సాధిస్తుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి యూ.ఎస్ ప్రకాశ్ రావు, మండల అధ్యక్షులు జుజ్జురి వెంకన్న బాబు,నియోజకవర్గ నాయకులు సున్నం నాగమణి,వగ్గేలా పూజ, డాక్టర్ భూక్య ప్రసాద్,జెడ్పీటీసీ మాజీ సభ్యులు జూపల్లి రమణారావు, అంకిత మల్లికార్జున రావు,మండల పరిషత్ పూర్వ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి,మల్లాయిగూడెం మాజీ సర్పంచ్ నారం రాజశేఖర్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సంకా ప్రసాద్,సత్యవరపు సంపూర్ణ,ఆరేపల్లి గోవింద్,ఆరేపల్లి రాంబాబు,కొనకళ్ళ శ్రీనివాస్,చిక్కం మాధురి,సంకుల స్వరూపారాణి, ఏలేటి పార్వతి, రఘురాం తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -