నవతెలంగాణ-హైదరాబాద్: మంగోలియా అధ్యక్షుడు ఖురేల్సుఖ్ ఉఖ్నా భారత్ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని అతిథి గృహం హైదరాబాద్ వైట్‌హౌస్‌లో మంగోలియా అధ్యక్షుడికి ప్రధాని మోడీ ఘనంగా స్వాగతం పలికారు. ఇరునేతలు కరచాలనం చేసుకున్నారు. ప్రధాని గెస్ట్‌హౌస్‌లో ఇరునేతలు భేటీ అయ్యారు. అనంతరం ఖురేల్సుఖ్ హైదరాబాద్ వైట్‌హౌస్ ఆవరణలో ఇరు నేతలు కలిసి ఒక మొక్కను నాటారు.
కాగా, మంగోలియన్ అధ్యక్షునితోపాటు ఆయన వెంట వచ్చిన ప్రతినిధి బృందం మహాత్మాగాంధీ స్మారకవిచిహ్నం రాజ్‌ఘాట్ వద్ద పుష్పగుచ్చముంచి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. రాజ్‌ఘాట్ సందర్శక పుస్తకంలో ఉఖ్నా సంతకం చేశారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ విగ్రహాన్ని, పుస్తకాన్ని ఆయన బహూకరించారు.