– మండల వ్యవసాయ అధికారి రమేష్
నవతెలంగాణ – ఉప్పునుంతల
మొంథా తుఫాన్ ప్రభావంతో రైతుల పంట పొలాలు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో మండల వ్యవసాయ శాఖ అధికారి రమేష్ ఆధ్వర్యంలో అధికారులు గురువారం సూర్య తండా, వెల్టూరు, లక్ష్మాపూర్, మామిళ్ళపల్లి వంటి పలు గ్రామాల్లో పత్తి, వేరుశెనగ, వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. నష్టం వాటిల్లిన పంటలను రైతులతో కలిసి పంట నష్టం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రమేష్ మాట్లాడుతూ..“పంట నష్టం నమోదు పారదర్శకంగా జరుగుతుంది. రైతులు తమ పొలాల్లో నిలిచిన నీటిని తొలగించుకోవాలని, వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని” సూచించారు. ఈ కార్యక్రమంలో పిరటోనిపల్లి క్లస్టర్ ఏఈఓ సుమతి, వెల్టూరు ఏఈఓ చిన్య నాయక్, రైతులు పాల్గొన్నారు.



