నవతెలంగాణ – హైదరాబాద్: వాట్సాప్ తన వెబ్ యూజర్ల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కీలక ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ప్రత్యేకంగా డెస్క్‌టాప్ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకోకుండానే నేరుగా వెబ్ బ్రౌజర్ నుంచే వాయిస్, వీడియో కాల్స్ చేసుకునే సదుపాయాన్ని ప్రారంభించింది. ఈ కొత్త అప్‌డేట్‌తో వాట్సాప్ వెబ్ వినియోగం మరింత సులభతరం కానుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను దశలవారీగా విడుదల చేస్తున్నారు. ఈ వారం ప్రారంభంలో కొంతమంది బీటా టెస్టర్లకు ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మొబైల్, డెస్క్‌టాప్ యాప్‌లలో కనిపించే విధంగానే వాట్సాప్ వెబ్‌లోని వ్యక్తిగత చాట్‌లలో కూడా వాయిస్, వీడియో కాల్ ఐకాన్‌లు కనిపిస్తాయి. ఈ కాల్స్‌కు కూడా వాట్సాప్ అందిస్తున్న ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రత ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది. దీనివల్ల సంభాషణలు పూర్తిగా గోప్యంగా ఉంటాయి.
వాట్సాప్ లో కొత్త ఫీచర్
- Advertisement -
- Advertisement -



