Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కోతుల సమస్యను వెంటనే పరిష్కరించాలి: సీపీఐ(ఎం) 

కోతుల సమస్యను వెంటనే పరిష్కరించాలి: సీపీఐ(ఎం) 

- Advertisement -

గొంది రాజేష్ సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ సభ్యులు 
నవతెలంగాణ – గోవిందరావుపేట 

తహసిల్దార్ కార్యాలయం ముందు సీపీఐ(ఎం) ధర్నా మండలంలో కోతుల సమస్యను వెంటనే పరిష్కరించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు గొంది రాజేష్ అన్నారు. శనివారం కోతుల నుండి నుండి ప్రజలను కాపాడాలని పంట పొలాలను రక్షించాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గొంది రాజేష్ సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. కోతుల సమస్య ద్వారా ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కర్రలేకుండా మనిషి తోడు లేకుండా ఇంటి నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదని కోతుల నుండి ప్రజలకు ప్రాణభయం ఉందని, ఇప్పటికే గ్రామంలో దాదాపు 1000 మందికి పైగా బాధితులను కోతులు కరవడం జరిగిందని తెలిపారు.

వీరికి ఆరోగ్య ఖర్చులు చాలా అవుతున్నాయని, కొంతమంది వృద్ధులు కోతుల బారినపడి చనిపోవడం జరిగిందని, ప్రభుత్వం దీనిని చిన్న సమస్యగా కాకుండా ప్రజలకు ఉన్నటువంటి సామాజిక సమస్యగా చూస్తూ దీనిపై ఒక చట్టం తీసుకువచ్చి కోతుల నిర్మూలన చేయాలని కోరారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని, ఇది రాష్ట్రవ్యాప్త సమస్య అని ఎమ్మెల్యేలు, మంత్రులను మన గ్రామాలకు వచ్చినప్పుడు కోతుల సమస్యపై గ్రామాలకుని వీటి సమస్యపై, ప్రతి గ్రామం నుంచి వినతి పత్రాలు అందజేయాలని పిలుపునివ్వడం జరిగింది. ప్రజలు పార్టీలకతీతంగా ఉద్యమంలో పాల్గొనాలని, భవిష్యత్తులో చలో కలెక్టరేట్ ఉద్యమం చేపడుతామని అన్నారు. ఆ పోరాటంలో ప్రజలందరూ కలిసి రావాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా మండల తాహసిల్దారు కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొదిల్లా చిట్టిబాబు ఎర్రదనమ్మ గుండు రామస్వామి బుర్ర శ్రీనివాస్ కాప కోటేశ్వరరావు గుండు లెనిన్ నిమ్మల బిక్షం వెంకటేశ్వరరావు శీను శ్రీరామోజు సువర్ణ వరద మచ్చ మా లవడా అచ్చమ్మ మంచాల కవిత కడారి నాగరాజు అంబాల మురళి కోటి కృష్ణారావు తదితర ప్రజలు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -