Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeఆటలుహెచ్‌సీఏకు ఏకసభ్య కమిటీ

హెచ్‌సీఏకు ఏకసభ్య కమిటీ

- Advertisement -

జస్టిస్‌ నవీన్‌రావును
నియమించిన హైకోర్టు
నవతెలంగాణ-హైదరాబాద్‌ :
సిఐడి కేసులో హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఆఫీస్‌ బేరర్లు జైలుకెళ్లగా.. పాలన, క్రికెట్‌ కార్యకలాపాలు పడకేశాయి. అన్ని రూల్స్‌ను ఉల్లంఘిస్తూ ఇటీవల తాత్కాలిక ఉపాధ్యక్షుడు సర్దార్‌ దల్జీత్‌ సింగ్‌ 87వ ఏజీఎం (వాయిదా)ను మూడు రోజుల నోటీసుతోనే నిర్వహించటాన్ని సవాల్‌ చేస్తూ సఫీల్‌గూడ క్రికెట్‌ క్లబ్‌ హైకోర్టులో రిట్‌ పిటిషను దాఖలు చేసింది. పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ నగేశ్‌ బీమపాక ఏకసభ్య ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. నిబంధనలు పాటించకుండా ఏజీఎంను నిర్వహించటం పట్ల హెచ్‌సీఏ ఆఫీస్‌బేరర్లను ఆక్షేపించిన ధర్మాసనం.. ఇక నుంచి హెచ్‌సీఏ కార్యకలాపాల పర్యవేక్షణ, పరిపాలన గాడిలో పడేందుకు జస్టిస్‌ (విశ్రాంత) నవీన్‌రావుతో ఏకసభ్య కమిటీని నియమించింది. గతంలో సుప్రీంకోర్టు జస్టిస్‌ లావు నాగేశ్వర్‌ రావు కమిటీ తరహాలోనే నవీన్‌రావు కమిటీ పని చేస్తుందని.. హెచ్‌సీఏ యంత్రాంగం ఇక నుంచి ఏకసభ్య కమిటీ ఆదేశాల మేరకు పని చేయాలని ఏకసభ్య ధర్మాసనం ఆదేశించింది. కనీస నోటీసు పీరియడ్‌ లేకుండా వార్షిక సర్వ సభ్య సమావేశం నిర్వహించటంపై జస్టిస్‌ నగేశ్‌ బీమపాక పూర్తి స్థాయిలో వాదనలు విననున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad