.. నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదాలు..
.. తడి చేతులతో స్తంభాలు, తీగలు పట్టుకోవద్దు..
నవతెలంగాణ-నాగిరెడ్డిపేట్…
వాన కాలంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన విద్యుత్ ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. అజాగ్రత్తగా ఉంటే ప్రాణాలు గాల్లో కలుస్తాయి. గాలి వేసిన, భారీ వర్షాలు కురిసిన సమయంలో కరెంటు తీగలు తెగిపడుతుంటాయి. వాటిని గమనించకుండా వెళ్తే ప్రాణాపాయం సంభవిస్తుంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మప్పు, అధిగమించవచ్చు. వానాకాలంలో గృహ వినియోగదారులతో పాటు రైతులు విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండటం మంచిది.
.. వ్యవసాయ బోరు మోటర్ల వద్ద…
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో పాటు చుట్టూ గ్రామాలలో వ్యవసాయం మోటార్ల వినియోగం బాగా పెరిగింది గతంలో వ్యవసాయం చెరువులు కుంటలు ప్రాజెక్టులపై ఆధారపడి ఉండేవారు ప్రస్తుతం బోరు మోటార్ల వినియోగం అధికంగా పెరిగిపోయింది. ప్రధానంగా పరువు భావన వద్ద స్టార్టర్లు తీగలు అస్తవ్యస్తంగా ఉంటాయి. వాటిని నిర్వహణ సరిగా లేక ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. మోటర్లు ఆన్ చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలి వేలాడే తీగలను ముందే గుర్తించాలి, టాటా డబ్బా వద్ద తీగలను సరి చేయాలి ఫీజులను తరచూ పరిశీలించాలి. వాన పడుతున్నప్పుడు బోర్ ఆన్ చేయకుండా కాళ్ళకు రబ్బరు చెప్పులు చేతి తొడుగులు తప్పక ధరించాలి. స్టార్టర్ బాక్సుల్లో విష సర్పాలు, ఎలుకలు చేరి తీగలను కొరికేస్తాయి. వాటిని గమనించకుండా రైతులు ఆన్ చేస్తే విద్యుత్ ప్రమాదాలు సంభవించే ఆస్కారం ఉంది. తడి చేతులతో స్తంభాలు తీగలను పట్టుకోవద్దు ఫైబర్ స్టార్టర్ డబ్బా వినియోగిస్తే మేలు.
.. చెట్ల కింద ఉండొద్దు..
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల నుంచి మంటలు వచ్చినప్పుడు తీగలు తెగుతున్నప్పుడు సొంతంగా మరమ్మతులు చేయకూడదు. వాటిని చాలా దూరంగా ఉండాలి. పశువులు వాటి వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు వహించాలి. వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే సమయంలో ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఫోన్ స్విచాఫ్ చేసుకోవాలి చెట్ల కింద చేరవద్దు తీగల కింద ఉండొద్దు.
సురేందర్… లైన్ ఇన్స్పెక్టర్..
… వాన కాలంలో తరచుగా విద్యుత్ సమస్యలు వస్తా ఉంటాయి విద్యుత్ సమస్యలు రాగానే దగ్గర్లో ఉన్న విద్యుత్ అధికారిని సంప్రదించాలి. వారు అందుబాటులో లేకపోతే మండల స్థాయి అధికారులు దృష్టికి తీసుకెళ్లాలి. సొంతంగా ఎలాంటి మరమత్తులు చేయకూడదు…