Sunday, December 28, 2025
E-PAPER
Homeకవితవెన్నెల గీతం

వెన్నెల గీతం

- Advertisement -

చడి చప్పుడు లేని మనసు
ఉన్నట్టు ఉండి ఏకాంతంలో
” వెన్నెల గీతం ” ఆలపిస్తుంది.!
ఎప్పుడో మరిచిపోయిన మధురనుభూతులు..
పల్లె సందు గోందులో ముచ్చట్లు ఆడిన దృశ్యలు..
ఊరి చెరువు, ఊట బావుల్లో జలకలాడిన జ్ఞాపకాలు..
పోద్దు పోద్దు గల్ల గుడిలో వేసే భక్తి పాటలు
చుక్క పొడవకముందే నిదురలేపేవి.!
సూర్యుడు ఒళ్ళు విరిచి అవులింతాలతో పల్లెంత చుట్టేసేలోపు..
సద్ది మూట సర్దుకొని బడిబాట పట్టిన తీపి గురుతులు
రైతులు పంట పొలాల కి వెళ్లే అడుగుల చప్పులు..
ఇంకా ఎన్నెన్నో.. తేనే వలపుల సయ్యటలు
పలకరింపుల పాల కడియలు..
రాత్రి వెన్నెల్లో ఆడే ఆటలు.. చందురిడికే కన్ను కుట్టేవి..!
ఇప్పుడు ఆ ఆనందం అవిటితనమైంది..
ఆనాటి బంధాలు తెగిన గాలిపటం అయ్యాయి.
మనిషి మనిషిని పలకరించుకొనే సంప్రదాయం మట్టికలిసిపోయింది.!
పల్లె ఇప్పుడు పట్నం దారి పట్టి హొయలు ఓలుకుతుంది..
కృతిమ ప్రేమల లిప్‌ స్టిక్‌ ను సింగరించుకుంటుంది..
డబ్బుల చుట్టూ స్నేహం బొంగురం ల తిరుగుతుంది.!
మనస్సుకి ఓదార్పు నీచ్చే ఒక ఆత్మీయత దొరకదు
అడవిలో పూసిన వెన్నెల ల ఆనందం ఆవిరవుతుంటే..
లేని అనుబంధం సృష్టించుకొని
మనిషి డబ్బు, హౌదా కోసం పరుగులు పెడుతుండు..
కరోనా నేర్పిన పాఠం ఇంకా మరిచిపోలేదు.. ఈ జనం .
అయినా మార్పు రాక బావిలో కప్పలా
తెలియని లోకం కోసం పాకులడుతుండు.!
ఇప్పటికైనా మనిషి! మనిషిని అని గుర్తేరిగి
మమతల హరివిల్లు విరిసేలా.. మానవత్వం పరిమళించేలా..
తోటి మనిషిని గౌరవించి, అలనాటి
పెద్దల మాటల అమతపు గుళికలు నలుగురు కోసం పంచాలి ..
పల్లె లోగిలిలో అలనాటి ఆత్మీయ అనురాగాలు
తొలకరి జల్లుల కురిపించాలి..
మళ్ళీ పల్లె మోములో వసంతగానం
అమ్మ పెదవుల ధరహాసమయి గుభాలించాలి.!!

– కొండా రవీందర్‌, 9059237771

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -