నవతెలంగాణ హైదరాబాద్: శుక్రవారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో మరోసారి భారీ వర్షం కురిసింది. దీంతో మూసారాంబాగ్ బ్రిడ్జి పై నుంచి మూసీ వరద ఉద్దృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో మూసారాంబాగ్ బ్రిడ్జిపైకి వాహనాలను.. పోలీసులు, రెవెన్యూ అధికారులు నిలిపివేశారు. భారీ వర్షాలకు ఉస్మాన్ సాగర్ నిండిపోవడంతో పైనుంచి నీటిని దిగువ ప్రాంతాలకు వదలడంతో అంబర్‌పేటలోని మూసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు బ్రిడ్జిపై బారికేడ్లు ఏర్పాటు చేసి మూసివేశారు. దీంతో దిల్‌సుఖ్‌నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలను గోల్నాక కొత్త బ్రిడ్జి వైపు దారి మళ్లించారు.
బేగంబజార్, కోఠి, నాంపల్లి, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో రోడ్లన్ని జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీటితో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.