Saturday, October 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నైతిక విలువలు పాటించాలి.. 

నైతిక విలువలు పాటించాలి.. 

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్.. 
జిల్లా కోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన..
నవతెలంగాణ – భువనగిరి

న్యాయవాదులు నైతిక విలువలు పాటించాలని, కోర్టులు కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలని  తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ కోరారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు నూతన భవన నిర్మాణ శంకు స్థాపన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యి జిల్లా కోర్టుల నూతన భవన శంకు స్థాపన  శిలా పలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన భవనాన్ని కాల పరిమితిలో పూర్తి చేయాలని ఆకాంక్షించారు. నేడు జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా న్యాయమూర్తులు బాలికలకు శుభాకాంక్షలు తెలిపి వారిని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తి మరియు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ న్యాయమూర్తి కె. శరత్, ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తులు జస్టిస్ కె. లక్ష్మణ్, శ్రీమతి జస్టిస్ కె.సుజన, జస్టిస్ వి. రామకృష్ణ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయమూర్తి ఎ.జయరాజు, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి.ముక్తిదా, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి మాధవి లత, భువనగిరి ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి ఉషశ్రీ, అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎన్. శ్యాంసుందర్, రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి సబిత, భువనగిరి ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి స్వాతి, రామన్నపేట ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి సరిత, చౌటుప్పల్ జూనియర్ సివిల్ జడ్జి మహతి వైష్ణవి, ఆలేరు జూనియర్ సివిల్ జడ్జి అజయ్ కుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ యం.హనుమంతరావు , జిల్లా పరిపాలన యంత్రాంగం,  రాచకొండ పోలీస్ కమిషనర్ జి.సుధీర్ బాబు,  డిప్యూటీ పోలీస్ కమిషనర్ అక్షాంశ్ యాదవ్, జిల్లా పోలీసు యంత్రాంగం, భువనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి.వెంకటయ్య గౌడ్, కార్యదర్శి బొల్లేపల్లి కుమార్, జిల్లాలోని రామన్నపేట, చౌటుప్పల్ , ఆలేరు, భువనగిరి న్యాయవాదుల సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు ఉన్నత న్యాయస్థాన చీఫ్ జస్టిస్ కు న్యాయమూర్తులను సన్మానించి మెమెంటోలను అందజేశారు. ఈ కార్యక్రమములో న్యాయవాదులు వెన్నెల, జె భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్.ఆర్.పాఠశాల విద్యార్తినిలచే స్వాగతనృత్యం చేయించారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -