Thursday, February 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగతం కంటే ఎక్కువ అక్రిడిటేషన్లు

గతం కంటే ఎక్కువ అక్రిడిటేషన్లు

- Advertisement -

డెస్క్‌ జర్నలిస్టులు ఆందోళన చెందొద్దు :డీజేఎఫ్‌టీకి సీఎం సీపీఆర్వో మల్సూర్‌ హామీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పిన ప్రకారం డెస్క్‌ జర్నలిస్టులకు గతంలో కంటే ఎక్కువగానే అక్రిడిటేషన్‌ కార్డులు వస్తాయని సీఎం సీపీఆర్వో మల్సూర్‌ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో సీఎం సీపీఆర్వోను డెస్క్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ అఫ్‌ తెలంగాణ (డీజేఎఫ్‌టీ) రాష్ట్ర నాయకులు కలిసి డెస్క్‌ జర్నలిస్టుల అక్రిడిటేషన్లలో నెలకొన్న గందరగోళంపై వినతిపత్రం అందజేశారు. ప్రతి జిల్లాకు ఎంతమంది సబ్‌ ఎడిటర్లు పని చేస్తున్నారు, వారికి గతంలో ఎన్ని కార్డులు ఇచ్చారు, ఇప్పుడు ఎన్ని ఇస్తున్నారు, జిల్లా డెస్కులు, ఎడిషన్‌ సెంటర్ల వివరాలు అన్నీ ఈ సందర్భంగా సీఎం సీపీఆర్వో మల్సూర్‌కు వివరించారు.

అన్ని విషయాలు ఓపికగా విన్న ఆయన డెస్క్‌ జర్నలిస్టుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించారు. గతంలో కంటే కార్డులు తగ్గించొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంగా అధికారులకు చెప్పారని అన్నారు. గతంలో డెస్క్‌ జర్నలిస్టులకు ఎన్ని అక్రెడిటేషన్లు ఇచ్చారనేది వివరాలు తెప్పించి చూస్తాననీ, ఆ మేరకు కార్డులు వచ్చేలా సమాచార శాఖ మంత్రి, కమిషనర్‌తో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అక్రిడిటేషన్ల విషయంలో జర్నలిస్టులెవరూ ఆందోళన చెందొద్దని సీఎం సీపీఆర్వో సూచించారు. సీపీఆర్వోను కలిసిన వారిలో డీజేఎఫ్‌టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మస్తాన్‌, రాష్ట్ర నాయకులు దొడ్డి శేఖర్‌, ఓగోటి కిరణ్‌ కుమార్‌, వినోద్‌ రావు, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -