Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeసినిమారక్తదానంపై మరింత అవగాహన అవసరం

రక్తదానంపై మరింత అవగాహన అవసరం

- Advertisement -

79వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని ఫీనిక్స్‌ ఫౌండేషన్‌, చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ సంయుక్తంగా మెగా బ్లడ్‌ డొనేషన్‌ డ్రైవ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. హీరో తేజా సజ్జా, హీరోయిన్‌ సంయుక్త అతిథులుగా హాజరయ్యారు. బుధరవారం నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో 800 మంది రక్తదానం చేశారు. సేకరించిన రక్తాన్ని ఇండియన్‌ ఆర్మీకి డొనేట్‌ చేయనున్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ‘నాకు అత్యంత ఆప్తుడైన సురేష్‌ చుక్కపల్లి చేస్తున్న అనేక సామాజిక కార్యక్రమాలతో పాటు గత రెండేళ్లుగా ఈ బ్లడ్‌ డొనేషన్‌ కూడా మొదలుపెట్టి, నా హదయానికి మరింత దగ్గర అయ్యారు. రక్తదానం చేస్తున్న దాతలు అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. రక్తదానం చేయడం అనేది ఎనలేని సంతప్తిని ఇస్తుంది. దాని వలన ఒక ప్రాణం నిలబడుతుంది. నేను ఇది ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న గొప్ప ఫీలింగ్‌. రక్తదానం గురించి నేను ఎన్నోసార్లు చెప్పాను. కానీ కొత్త జనరేషన్‌ కొత్త యువత వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. రక్తదానం అనగానే నా పేరు స్ఫురించడం అనేది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను’ అని అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad