Monday, February 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనిర్మాణరంగంపై మరింత స్పష్టత ఇవ్వాలి

నిర్మాణరంగంపై మరింత స్పష్టత ఇవ్వాలి

- Advertisement -

బడ్జెట్‌ను స్వాగతిస్తున్నాం- క్రెడాయ్ హైదరాబాద్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను స్వాగతిస్తున్నామని క్రెడాయ్ హైదరాబాద్‌ పేర్కొంది. ఈ మేరకు క్రెడాయ్ హైదరాబాద్‌ అధ్యక్ష, ఎలెక్ట్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌. జైదీప్‌ రెడ్డి, బి. జగన్నాధరావు, క్రాంతికిరణ్‌రెడ్డి ఆదివారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణ రంగానికి ప్రోత్సాహకాలపై మరింత స్పష్టత ఇవ్వాలని కోరారు. మౌలిక సదుపాయాల కల్పన ద్వారా దేశవ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ వృద్ధికి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. దీనికోసం తాము సుదీర్ఘకాలంగా డిమాండ్లు చేస్తున్నామని గుర్తుచేశారు. ఏఐ, బయో ఫార్మా పరిశోధన, ఐటీ, సాఫ్ట్‌వేర్‌, డేటా సెంటర్ల వంటి భవిష్యత్‌ ప్రాజెక్టులతో నిర్మాణరంగం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అయితే సాధారణ ప్రజానీకానికి అనుకూలమైన గృహ నిర్మాణాలకు సంబంధించి తాము ఆశించిన పన్ను ప్రోత్సాహకాలు, ఉద్దీపనలు లభించలేదని తెలిపారు. బడ్జెట్‌లో దీర్ఘకాలిక వృద్ధి దృష్టి ఉన్నదని అభిప్రాయపడ్డారు. స్థిరాస్తుల పన్నుల స్థిరత్వంపై మరింత దృష్టిసారించి ఉండాల్సిందని పేర్కొన్నారు. పట్టణ మౌలిక సదుపాయాల కల్పనకు రూ.వెయ్యి కోట్ల మున్సిపల్‌ బాండ్లలో రూ.100 కోట్ల ప్రోత్సాహకాలను ప్రతిపాదించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అమత్‌ సిటీ పథకం విస్తరణ, పన్ను రిటర్న్‌ల సవరణ గడువును పొడి గించడం, విదేశీ ఆస్తుల బహిర్గతం చేసే పథకాన్ని ప్రవేశపెట్టడం వంటి నిర్ణయాలు నిర్మాణరంగానికి ఊతాన్ని ఇస్తాయని అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -