- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ : దేశ వ్యాప్తం గా 5 సంవత్స రాల నుండి 16 సంవత్సరాల వయస్సు కలిగిన బాలలకు సృజనాత్మక ఆలోచనలు పెంపొందించే బాల భవన్ కు అధిక నిధులు కేటాయించాలని బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడువలస సుభాష్ చంద్రబోస్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. అనుభవజ్ఞ లైన కళలకు చెందిన గురువులచే బాలలకు శిక్షణ అందించాలనేదే జవహర్ బాల భవన్ సంస్థ లక్ష్యంగా ఏర్పాటు చేశారన్నారు. వివిధ కళలను, కళా రూపాలను నేర్పించే కార్య కలాపాలను అందించేందుకు స్థాపించారు. చిత్రలేఖనం సం గీతం, నాట్య రంగంలో ప్రావీణ్యం అందిస్తూ వివిధ రకాల వయోలిన్, మృదంగం లాంటి వాయిద్యాల శిక్షణ కల్పించాలని కోరారు.
- Advertisement -