ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్
నవతెలంగాణ – ఆర్మూర్
ప్రజా సేవే లక్ష్యంగా ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు అందిస్తానని అయ్యప్ప పౌండేషన్ చైర్మన్ వన్నెల్ దేవి అయ్యప్ప శ్రీనివాస్ తెలిపారు. పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి పట్టణంలోని సిద్దుల గుట్ట యందు నిర్మించిన అయ్యప్ప ఆలయానికి 5 లక్షల విరాళం సైతం అందజేసి, ఎవరితో డబ్బులు సమీకరించకుండా గుడి నిర్మాణంలో భాగస్వామి అయినట్టు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చైర్పర్సన్ గా సతీమణి లావణ్య 11 నెలలు పదవి బాధ్యతలు స్వీకరించి నిర్విరామ సేవలు చేసినట్టు తెలిపారు.
ప్రజలకు ,మధ్యతరగతి వాళ్లకు ఆర్థికంగా, ఆరోగ్యపరమైన సమస్యలు ఏమున్నా తీరుస్తానని హామీ ఇచ్చినారు. చిన్ననాటి మిత్రునికి యాక్సిడెంట్ కాగా సహాయం సాకారాలు అందించినట్టు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పదవ తరగతి విద్యార్థులకు ,ఉత్తమ ర్యాంకులు సాధించిన వారికి, చదువులో ముందుండి ఆర్థిక స్థోమత లేని వారికి సహాయం అందిస్తామని తెలిపారు. ముఖ్యంగా వైకుంఠ దామాల్లోకి తీసుకెళ్లే స్వర్గ రథాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య సలహాదారు రిటైర్డ్ ఎంఈఓ సాయన్న, రిటైర్డ్ టీచర్ ఆకుల గంగాధర్, జంబి హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ గోర్తా దేవేందర్, లింబాద్రి గౌడ్ ,విజయ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
కమిటీ ఏర్పాటు..
అయ్యప్ప పౌండేషన్ కమిటీని ఏర్పాటు చేసినట్టు ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ తెలిపారు. వైస్ ప్రెసిడెంట్ గా చేపూర్ గణేష్, జనరల్ సెక్రెటరీగా టి శ్రీనివాస్ రెడ్డి, ట్రెజరర్ గా వన్నెల దేవి లావణ్య లతో పాటు కార్యవర్గ సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.



