ఐదుగురు సర్పంచులపై కేసు
మాచారెడ్డి : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో వీధి కుక్కలను చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పాల్వంచ మండల కేంద్రంతో పాటు ఫరీద్‌పేట్, బండరామేశ్వర్‌పల్లి, భవానీపేట, వాడి గ్రామాల్లో 600కి పైగా వీధి కుక్కలను చంపేశారు. ఇటీవల ఎన్నికైన నూతన సర్పంచ్‌ల ఆధ్వర్యంలో ఈ చర్య జరిగినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఇంజెక్షన్లు, గుళికలు ఇవ్వడంతో 600కు పైగా కుక్కలు చనిపోయాయి.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఈ ఘటనపై జంతు హక్కుల కార్యకర్తలు మూల రజని, ఎనుప్రోలు అనిత, భాను ప్రకాశ్, గోవర్ధన్, గౌతమ్ తదితరులు మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు సర్పంచులపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కుక్కలను పాతిపెట్టిన ప్రాంతాలను గుర్తించి తవ్వితీసి వాటి కళేబరాలతో పంచనామా నిర్వహించారు. కుక్కలు మృత్యవాత పడటానికి కారకులైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. వీధి కుక్కలను గ్రామాల నుంచి తరిమికొడతామంటూ సర్పంచులు ఇచ్చిన హామీ మేరకు జంతువులను చంపడం ఎంతవరకు సమంజసమని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు కలిసే వీధి కుక్కలను చంపినట్టు ప్రాథమికంగా నిర్ధారించినట్టు పోలీసులు పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లాలో 600కు పైగా వీధికుక్కల మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



