- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇరాన్ అధికారికంగా హార్ముజ్ జలసంధిని మూసివేసింది. నౌకలు దాటడానికి ప్రయత్నిస్తే తగలబెడతామని ఐఆర్‌జీసీ హెచ్చరించింది. ఇరాన్ చర్యతో హార్ముజ్ వద్ద 700కి పైగా నౌకలు చిక్కుకుపోయాయి. వాటిలో 100 కంటైనర్ షిప్స్ ఉన్నాయి. మార్చి 1వ తేదీన ఈ మార్గం నుంచి బయటకు కేవలం 3 ట్యాంకర్లు మాత్రమే వెళ్లగా, మార్చి 2న కేవలం ఒక చిన్న ట్యాంకర్, కార్గోషిప్ మాత్రమే ప్రయాణం సాగించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
- Advertisement -



