గాజా : 2023 అక్టోబర్ 7న ప్రారంభమైన పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడుల వల్ల లక్షలాది మంది మరణించారు. 29 నెలలపాటు జరిగిన ఇజ్రాయిల్ దాడుల వల్ల గాజాలో 21,510 మంది మృతి చెందారు. ఇప్పటికీ 8 వేల మంది చిన్నారులు ఆచూకీ లేరు. బాంబుల దాడికి కూలిపోయిన భవనాల శిథిలాల కింద 2,100 మంది చిక్కుకుపోయారని తాజాగా పాలస్తీనా కేంద్రం వెల్లడించింది. వేలాది మంది చిన్నారులు అదృశ్యమవ్వడంపై పాలస్తీనా ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలో వివిధ ప్రాంతాల్లో సుమారు 200 మంది మైనర్లు ఆచూకీ లేకుండా అదృశ్యమయ్యారు. ఇజ్రాయిల్ దాడుల వల్లే వారు గల్లంతయ్యారని అనుమానాలున్నాయని పాలస్తీనా కేంద్రం నివేదించింది. ఇజ్రాయిల్ దాడులకు గురైన అత్యంత ప్రభావితమైన ప్రాంతంలోనూ, మానవతా సహాయం కోసం ఎదురుచూసే ప్రదేశాల్లోనూ, ఆహారం కోసం వెతుకున్నప్పుడు గానీ పిల్లలు అదృశమయ్యారని పాలస్తీనా కేంద్రం నివేదిక వివరించింది.
గాజాలో 8 వేల మందికిపైగా చిన్నారులు గల్లంతు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



