అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని దక్కించుకుంది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ పై పొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్ మాట్లాడుతూ,’ఈ సినిమా మేము ఊహించినదాని కంటే పెద్ద విజయాన్ని సాధిస్తోంది. ఇప్పటిదాకా మొత్తం రూ.7.28 కోట్ల కలెక్షన్స్ రాగా, కేవలం నైజాం నుంచే రూ. 5 కోట్ల 2లక్షలు వసూలు అయ్యాయి. ఐ బొమ్మ క్లోజ్ అవడం వల్ల మా మూవీ కలెక్షన్స్ పెరిగాయి. రూ. 99 టికెట్ రేట్ పెట్టడం వల్ల ఫ్లస్ అయ్యింది. సి సెంటర్స్‌లో కూడా సినిమాకు బాగా వసూళ్లు రావడం ఈ సినిమా ఎంత బాగా జనాల్లోకి వెళ్లింది అనేది ప్రూవ్ చేస్తోంది. మా చిత్రానికి రూ.50 కోట్ల వసూళ్లు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ ప్రాజెక్ట్‌ను నమ్మి చేసిన ఈటీవీ విన్‌కి నా అభినందనలు’ అని అన్నారు. ‘ఈ సినిమాకు ప్రేక్షకులు అందించిన విజయం సంతోషాన్ని ఇస్తోంది. ఈ సినిమా చూస్తూ అమ్మాయిలు ఎమోషన్‌కు గురవుతున్నారు. మేము పెట్టిన పెట్టుబడికి నాలుగు రెట్ల లాభాన్ని ఈ మూవీ ఇస్తుందని ఆశిస్తున్నాం’ అని ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి చెప్పారు.
ఊహించిన దానికంటే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



