హీరో విశ్వక్ సేన్, దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘ఫంకీ’. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ‘టీజర్‌లో విశ్వక్ సేన్ దర్శకుడి పాత్రను పోషిస్తూ, సరికొత్తగా కనిపించారు. కథానాయిక కయాదు లోహర్ తన అందంతో కట్టిపడేశారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దర్శకుడు అనుదీప్ శైలి ప్రత్యేక వినోదం టీజర్‌లో అడుగడుగునా కనిపించింది. ఆయన దర్శకత్వం వహించిన ‘జాతిరత్నాలు’ ఏ స్థాయిలో నవ్వులను పంచిందో తెలిసిందే.
ఇప్పుడు అంతకుమించిన స్థాయిలో నవ్వులను పంచి, ప్రేక్షకులకు సరికొత్త వినోద విందుని అందించబోతున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాణ సంస్థల నుంచి వస్తున్న సినిమా కావడంతో, ఈసినిమాపై సహజంగానే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా టీజర్ ఉంది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి’ అని చిత్ర యూనిట్ తెలిపింది.
అంతకు మించి వినోదం
- Advertisement -
- Advertisement -