‘మల్లేశం, 8 ఏఎం, మెట్రో’ చిత్రాలతో ప్రశం సలు పొందిన దర్శకుడు రాజ్ ఆర్ లేటెస్ట్‌గా తెరకెక్కించిన ’23’తో మరో విజయాన్ని అందుకున్నారు. స్టూడియో 99 నిర్మించిన ఈ చిత్రంలో తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించారు. వెంకట్ సిద్దారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ సినిమాని స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ చేసింది. ఈనెల 16న గ్రాండ్‌గా రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల ప్రసంశలు అందుకుని, సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. డైరెక్టర్ రాజ్ ఆర్ మాట్లాడుతూ,’ మా సినిమాకి రావలసిన సపోర్ట్, ఆదరణ కంటే ఎక్కువ వచ్చింది. ఒక మూవీ సక్సెస్‌కి చాలా పారామీటర్స్ ఉంటాయి. ఈ సినిమా ఛాలెంజింగ్ అని తెలుసు. ఇలాంటి సినిమాతో స్ఫూర్తి పొంది ఇలాంటి కథలు మరొకరు తీస్తారనే ఒక ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. అందుకే ఇలాంటి ప్రయోగం చేశాం. సినిమాకి ఆడియన్స్ నుంచి యాక్సెప్టెన్సీ వచ్చింది. అదే మా సక్సెస్. ఒక డైరెక్టర్‌గా నాకు అందరికంటే ఫేవరెట్ క్యారెక్టర్ తేజ చేసింది. మొత్తం తన భుజాల మీద మోసాడు. నేను తనని నమ్మాను. ఆ నమ్మకం నిలబెట్టాడు. అందరూ నటీనటులు చాలా అద్భుతంగా చేశారు’ అని తెలిపారు. ‘మీ అందరి సపోర్ట్‌కి థ్యాంక్యూ. తొలి సినిమాకే ఇలాంటి ఒక మంచి క్యారెక్టర్ దొరకడం అదష్టంగా భావిస్తున్నాను. సినిమా అందరికీ నచ్చింది. చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. మంచి రివ్యూస్ వచ్చాయి. ఈ సినిమాని అందరూ చూడాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ రాజ్‌కి కృతజ్ఞతలు’ అని కథానాయిక తన్మయి చెప్పారు. హీరో తేజ మాట్లాడుతూ,’ఒక డెబ్యు యాక్టర్‌కి ఇంత మంచి ఇంటెన్స్ స్టోరీ దొరకడం అదష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రాజ్‌కి థ్యాంక్యూ. 10 ఏళ్ల తర్వాత చేయాల్సిన రోల్ ఇది. నాపై నమ్మకంతో ఆయన ఈ పాత్రను ఇచ్చారు. ఈ సినిమాలో అందరూ కూడా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. ఈ సినిమాకి ఆర్గానిక్‌గా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది’ అని అన్నారు.