Friday, November 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆయిల్ ఫామ్ సాగుపై మరింత అవగాహన 

ఆయిల్ ఫామ్ సాగుపై మరింత అవగాహన 

- Advertisement -

శ్రీకాంత్ జిల్లా ఉద్యానవన శాఖ అధికారి 
నవతెలంగాణ – గోవిందరావుపేట 

రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై మరింత అవగాహన పెంచుకోవాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం మండలంలో చల్వాయి దుంపలగూడెం గోవిందరావుపేట రైతు వేదికలలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు మరియు ఉపాధి హామీ పథకం అధికారులకు ధాన్యం కొనుగోలు కేంద్రాల సంస్థలకు వ్యవసాయ శాఖ మరియు కే ఎన్ బయో సైన్సెస్ వారి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా హార్టికల్చర్ అధికారి శ్రీకాంత్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇప్పుడు ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ఎలా కొనుగోలు చేస్తుందో అదే పద్ధతిలో ఆయిల్ ఫామ్ గెలలను కూడా ఖరీదు చేస్తారని అన్నారు. నిరంతరం రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంటారు కాబట్టి వారికి ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కల్పించాలని అన్నారు. ఆయిల్ ఫాం సాగు పై ప్రభుత్వము ఇస్తున్న సబ్సిడీలు అంతర్ పంటలు డ్రిప్ సబ్సిడీలను పూర్తిస్థాయిలో వివరించి రైతులు ఆయిల్ ఫామ్ సాగు వైపు మొగ్గు చూపేలా అధికారులు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కే జితేందర్ రెడ్డి తోపాటు ఏఇవోలు రైతులు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -