Thursday, July 3, 2025
E-PAPER
Homeసినిమా'మార్గన్‌'కు విశేష ప్రేక్షకాదరణ

‘మార్గన్‌’కు విశేష ప్రేక్షకాదరణ

- Advertisement -

విజయ్‌ ఆంటోని నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘మార్గన్‌’. లియో జాన్‌ పాల్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను విజయ్‌ ఆంటోని ఫిలింస్‌ కార్పొరేషన్‌ నిర్మించగా, సర్వాంత్‌ రామ్‌ క్రియేషన్స్‌ బానర్‌ పై జె.రామాంజనేయులు సమర్పించారు.
ఇటీవల ఈ చిత్రాన్ని సురేష్‌ బాబు తెలుగులో రిలీజ్‌ చేశారు. దీనికి మంచి రెస్పాన్స్‌ వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో హీరో విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ,’ఈ సినిమాను సురేష్‌ బాబు, రామాంజనేయులు చాలా గ్రాండ్‌గా తెలుగులో రిలీజ్‌ చేశారు. ఇకపై నా సినిమాల్ని తెలుగులో రిలీజ్‌ చేస్తానని సురేష్‌ బాబు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఇంత మంచి మూవీని ఇచ్చిన దర్శకుడు లియో జాన్‌ పాల్‌కు థ్యాంక్స్‌. అజరును ఇంత బాగా లాంచ్‌ చేసినందుకు నాకు చాలా గర్వంగా అనిపించింది. తెలుగు, తమిళంలో అజయ్‌కు మంచి పేరు వచ్చింది. అజయ్‌ ఇకపై ఇలానే మంచి కంటెంట్‌ చిత్రాల్ని చేస్తూ ఆడియెన్స్‌ నుంచి ప్రేమను సంపాదిస్తూనే ఉండాలి.అజయ్‌తో కలిసి నేను ఇక స్ట్రెయిట్‌ తెలుగు సినిమాల్ని నిర్మిస్తాను. తమిళంలో ప్రస్తుతం ఏడు చిత్రాలను చేస్తున్నాను. త్వరలోనే ‘భద్రకాళి’ రానుంది. అదొక పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌. ‘మార్గన్‌’ను ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన తెలుగు ఆడియెన్స్‌కు థ్యాంక్స్‌’ అని అన్నారు.
‘విజయ్‌ ఆంటోనీ సహకారంతో హై టెక్నికల్‌ స్టాండర్డ్స్‌లో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించాం. డబ్బింగ్‌ విషయం లోనూ ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. ఆయనతో కలిసి పని చేయడం నా అదష్టం. అజయ్‌ అద్భుతంగా నటించారు. తెలుగులోనూ మంచి విజయం సాధించడం ఆనందంగా ఉంది’ అని దర్శకుడు లియో జాన్‌ పాల్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -