నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో శనివారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో దోమల నివారణ చర్యలు చేపట్టారు. గ్రామ పంచాయతీ పరిధిలోని గాంధీనగర్ వడ్డెర కాలనీలో, ఇందిరమ్మ కాలనీల్లో ఫాగింగ్ చేయించారు. గ్రామంలోని ఖాళీ ప్రదేశాల్లో దోమల నివారణ మందును పిచికారి చేయించారు. గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది గ్రామంలో వర్షం నీరు నిలిచిన గుంతల్లో, మురికి కాలువల వెంట దోమలు వృద్ధి చెందకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లారు.
దోమల లార్వాను చంపేందుకు, దోమల నివారణ కోసం నీటి మడుగులో ఆయిల్ బాల్స్ వేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి గంగాజమున మాట్లాడుతూ.. నీటి గుంతలో ఆయిల్ బాల్స్ వేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం ద్వారా దోమల వృద్ధిని నివారించవచ్చని తెలిపారు.ప్రజలు కూడా సీజనల్ వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, రోజుల తరబడి నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంటుందన్నారు.
కమ్మర్ పల్లిలో దోమల నివారణ చర్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES