Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కోన సముందర్ లో దోమల నివారణ చర్యలు

కోన సముందర్ లో దోమల నివారణ చర్యలు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కోన సముందర్ లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శనివారం దోమల నివారణ చర్యలు చేపట్టారు. రోజుల క్రితం గ్రామంలో డెంగ్యూ కేసు నమోదైన నేపథ్యంలో అధికారుల ఆదేశాల మేరకు  నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దోమల నివారణ చర్యల్లో భాగంగా గ్రామంలోని అన్ని కాలనీల్లో మురికి కాలువల వెంబడి పంచాయతీ సిబ్బందితో బ్లీచింగ్ పౌడర్ వేసి క్లోరినేషన్ చేయించారు. దోమల నివారణ కోసం వాడ వాడల్లో, మురికి కాలువల వెంట దోమల మందును, ఖాళీ ప్రదేశాల్లో, రహదారి వెంట పిచ్చి మొక్కలను నివారించేందుకు గడ్డి మందు పిచికారి చేశారు. గ్రామంలో నిర్వహిస్తున్న దోమల నివారణ చర్యలను పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ స్వయంగా పర్యవేక్షించారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad