Wednesday, March 25, 2026
E-PAPER
Homeజాతీయంఒడిశాలో మావోయిస్టు స‌రెండ‌ర్

ఒడిశాలో మావోయిస్టు స‌రెండ‌ర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఆపరేష‌న్ క‌గార్ గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న‌కొద్ది మావోయిష్టుల లొంగ‌బాటులు జోరందుకున్నాయి. ఇప్ప‌టికే కీల‌క నేత‌లు ఆయా రాష్ట్రాల్లో అధికారుల ముందు ఆయుధాల‌తో స‌హా స‌రెండ‌ర్ అవుతున్నారు. ఈక్ర‌మంలోనే ఒడిశాలో మావోయిస్టు నాయకులలో ఒకరైన సుక్రు, మరో నలుగురితో కలిసి ఒడిశా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. వారి ఆయుధాలను అప్పగించారని అధికారులు బుధవారం తెలిపారు. స‌దురు మావోయిస్టులపై మొత్తం రూ. 66 లక్షల రివార్డు ఉందని ఏడీజీ (నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలు) సంజీవ్ పాండా తెలిపారు. వారి వ‌ద్ద‌ ఒక ఏకే-47 గన్, ఒక ఇన్సాస్ గన్, ఒక సింగిల్-షాట్ గన్‌తో సహా ఐదు ఆయుధాలను కూడా అప్పగించారు. మ‌రోవైపు ఈ నెల‌ 31తో మావోయిష్టు ముక్త భార‌త్ ల‌క్ష్య‌మేంటూ బీజేపీ స‌ర్కార్ టార్గ్‌ట్ పెట్టుకుంది. అందుకు అనుగుణంగా పావులు క‌దుపుతోంది. ఆప‌రేష‌న్ క‌గార్ పేరుతో అడ‌వుల్లో జ‌ల్లెడ ప‌డుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -