Saturday, May 10, 2025
Homeతాజా వార్తలువిద్యుత్ షాక్ తో తల్లీకూతురు మృతి..

విద్యుత్ షాక్ తో తల్లీకూతురు మృతి..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్: పొద్దుపొద్దున్న నిద్రమత్తులో ఇనుప కూలర్ లో కాళ్ళు వేయడంతో తల్లీకూతురు మృతి చెందని ఘటన మండల పరిధిలోని తండాలో చోటుచేసుకుంది. స్థానికులు, జుక్కల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జుక్కల్ మండలంలోని పెద్ద గుల్లా తండాకు చెందిన చవాన్ శంక బాయి (36), కూతురు చవాన్ శివాని ఇంట్లో నిద్రపోతున్నారు. ఈ క్రమంలో ఉదయం కాళ్ళవద్ద ఉన్న ఇనుప కూలర్ లో కూతురు ఎడమ కాలు నిద్రమత్తులో వేసింది. దీంతో పాప కాలు కాలిపోవడంతో పాటు అక్కడికక్కడే మృతి చెందింది. కూతురు పక్కనే నిద్రిస్తున్న తల్లికి కూడా కూతురు ద్వారా విద్యుత్ షాక్ తగిలి ఆమె కూడా స్పాట్ లోనే చనిపోయింది. కొడుకు ప్రతిక్ ఇంటి అరు బయట పడుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.  ఉదయం లేచిన కొడుకు ప్రతిక్ తల్లి, చెల్లెలు ఇద్దరు మృత్యువాత పడడంతో తాండావాసులకు తెలిపాడు. వెంటనే వారు అక్కడికి చేరుకొని చూడగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించి విద్యుత్ సరఫరాను నిలుపుదల చేయించారు. ఇంకో పెద్ద కూతురు బంధువుల ఇంటికి వెళ్ళడంతో ప్రాణాపాయం నుండి తప్పించుకుందని వారు అంటున్నారు. సమాచారం అందుకున్న బిచ్కుంద సీఐ నరేష్ , జుక్కల్ పోలీసులు సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకుని, అక్కడున్నవారిని, కుటుంబీకులకు సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.  మృతురాలు చౌహాన్ శంకబాయి భర్త చౌహన్ ప్రహల్లాద్ వృత్తిరీత్యా డ్రైవర్ కావడంతో వేరే పట్టణానికి వెళ్ళాడు.  ఇతనికి ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు ఉన్నారు. తల్లీకూతురు మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. భర్త చౌహన్ ప్రహల్లాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నామని జుక్కల్ పోలీసులు తెలిపారు. మృతదేహాలను మద్నూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -