Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దారి దోపిడి..గాయాల పాలైన తల్లి కొడుకులు

దారి దోపిడి..గాయాల పాలైన తల్లి కొడుకులు

- Advertisement -



నవతెలంగాణ-మద్నూర్ : మద్నూర్ మండల కేంద్రానికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో 161వ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో దారి దోపిడి జ‌రిగింది. తల్లి కొడుకు బైక్ పైన వస్తున్న వారికి వెనుక నుండి టూ వీలర్ పై ఇద్దరు వ్యక్తులు హెల్మెట్లు పెట్టుకొని వారిని బెదిరించి తల్లి కొడుకుల వద్ద ఉన్న దాదాపు ఆరు నుండి ఏడు తులాల బంగారాన్ని అపహరించుకుని పారిపోయారు. శనివారం నాడు ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. దుండ‌గులు వారిపై కత్తితో దాడి చేయ‌డంతో గాయాల పాల‌య్య‌రు. వారిని మద్నూరు మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు చికిత్స పోందుతున్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన మల్లయ్య ఎల్లా గౌడ్, మల్లయ్య గారి సత్తెమ్మ, ను ఆస్పత్రిని సందర్శించి నవతెలంగాణ వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మద్నూరు మండల కేంద్రానికి హైవే రోడ్డు సర్వీసు దారిలో ఇద్దరూ పల్సర్ బండిపై హెల్మెట్లు పెట్టుకొని మా బండికి అడ్డుపడి కత్తితో దాడి చేశారని బంగారము ఇస్తారా సస్తారా అని బెదిరించి మాపైన ఉన్న బంగారాన్ని దోచుకెళ్లినట్లు తల్లి కొడుకులు తెలిపారు. దాడి దోపిడీకి గురైన తల్లి కొడుకులు కలిసి మద్నూర్ లో గల బంధువుల ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు వారు తెలిపారు. దారి దోపిడీ జరిగిన స్థలాన్ని ఎస్సై విజయ్ కొండ సందర్శించి పరిశీలించినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు కత్తిపోట్లతో దారి దోపిడీకి గురైన తల్లి కొడుకులు ప్రాణాపాయం లేకుండా క్షేమంగానే ఉన్నారని వారు కొద్దిగా భయభ్రాంతులతో ఆందోళన చెందుతున్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై ఎస్సై విజయ్ కొండాకు నవ తెలంగాణ ఫోన్ చేయగా ఫోన్ కాల్ ను ఎస్ఐ స్వీకరించలేకపోయారు పోలీసులు పూర్తి సమాచారం ఇవ్వవలసి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -