Saturday, September 27, 2025
E-PAPER
Homeహైదరాబాద్బతుకునిచ్చే అమ్మా బతుకమ్మ

బతుకునిచ్చే అమ్మా బతుకమ్మ

- Advertisement -

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
తెలంగాణసంస్కృతి,సాంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండగ,తెలంగాణ ఆస్తిత్వం బతుకమ్మలోనే ఉందని ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలోకి ఉన్నాయని మర్రి శోభారెడ్డి అన్నారు.నవరాత్రి,బతుకమ్మ పండగ నేపథ్యంలో  నల్లకుంటా తిలక్‌నగర్‌ కాలనీలోని శ్రీసాయి కో ఆపరెటీవ్‌ సోసైటి ఆధ్వరంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమే ముఖ్యథిగా పాల్గోన్నారు.ఈసందర్భంగా ఆమే మాట్లాడుతూ…తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైంది.ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఉరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ ఆస్థిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరుణంలో బతుకమ్మ ఖండాంతరాలుదాటి ప్రాథాన్యత సంతరించుకుంది.ఈ పూలపండుగ ఎంగిలిపూలతో మొదలుపెట్టి సద్దులబతుకమ్మతో ముగిసిపోతుందన్నారు. ఈకార్యక్రమంలో న్యాయవాది.కే ప్రవీణరెడ్డి, స్థానిక మహిళలు  పాల్గోన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -