నవతెలంగాణ – పెద్దవూర
నాగార్జున సాగర్ నియోజకవర్గం ప్రజలకు బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ బుసిరెడ్డి పండన్నా మానవతా మూర్తి మదర్ తెరిస్సా జయంతి సందర్బంగా శుభాకాంక్షలుతెలిపారు. నోబెల్ బహుమతి గ్రహీత మదర్ తెరిస్సా చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. మానవతామూర్తి మదర్ తెరిస్సా సేవకు ప్రతీక అన్నారు. ఆమె జీవితమంతా పేదవారికి, నిరుపేదలకు, రోగులకు, అనాధలకు అంకితం చేశారని, మానవత్వమే మతమని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తిత్వం మదర్ ధెరిస్సా అని కొనియాడారు. ఆమె చూపిన మార్గం ఎప్పటికీ మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తుంది అన్నారు. మదర్ ధెరిస్సా సేవాస్ఫూర్తి ప్రేరణతో సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఆమె సేవాస్ఫూర్తిని అనుసరించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
మానవతామూర్తి మదర్ థెరిస్సా: బుసిరెడ్డి పాండన్న
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES