Sunday, March 29, 2026
E-PAPER
Homeక్రైమ్కేనాల్ లో బాలుడుతో దూకిన తల్లి.. దొరకని ఆచూకీ

కేనాల్ లో బాలుడుతో దూకిన తల్లి.. దొరకని ఆచూకీ

- Advertisement -

నవతెలంగాణ – వర్ధన్నపేట:- కుమారుడితో ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. బాధిత కుటుంబ సభ్యులు వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి కట్ర్యాల గ్రామానికి చెందిన మేకల లింగయ్య దంపతులకు నలుగురు కూతురు లు చిన్న కూతురు కళ్యాణి ని స్టేషన్ ఘన్పూర్ కు ఇచ్చి వివాహం జరిపారు.
3 సంవత్సరాల కుమారుడుతో కలిసి కళ్యాణి దంపతులు వరంగల్ లో నివసిస్తున్నారు. భర్త కానిస్టేబుల్ కళ్యాణి మధ్య ఇటీవల గొడవలు జరిగినట్లు తెలిసింది. శనివారం కళ్యాణి కుమారుడితో తల్లిగారింటికి వచ్చి వారి వ్యవసాయ బావి వైపు ఉప్పరపల్లి క్రాస్ సమీపంలో ఉన్న ఎస్సారెస్పీ తెనాలి వద్ద తల్లి కుమారుడు చెప్పులు బయటే ఉంచి కెనాల్లో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు చెప్పులను గమనించిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు వర్ధన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గల్లంతయిన. కళ్యాణి, (24)కుమారుడు శ్రియన్స్ (3) ను గుర్తించేందుకు ఎన్టీఆర్ ఎఫ్ బృందం తో పాటు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు రాత్రి వరకు రాజుకి లభించకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మునిరయ్యారు. భార్య భర్తల మధ్య గొడవ కారణంగా తెలుస్తుందని ముక్కు పచ్చలారని కుమారుడితో తల్లి ఆత్మహత్యకు పాల్పడడంతో గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్ధన్నపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -