నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌లోని మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. వసంతపురి కాలనీలో ఏడు సంవత్సరాల బాలికని ఆమె తల్లే.. మూడంతస్తుల బిల్డింగ్‌పై నుంచి కిందికి తోసేసింది. తీవ్ర గాయాలపాలైన బాలిక గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. సీఐ సత్యనారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతురాలి తల్లిదండ్రులు గత 20 ఏళ్లుగా వసంతపురి కాలనీలో నివాసం ఉంటున్నారు. తండ్రి ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తల్లి మానసిక సమస్యలతో బాధ పడుతోంది. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం బాలికను అపార్ట్‌మెంట్ నుంచి కిందకు నెట్టేయడంతో పక్కింట్లోని మెట్లపై పడింది. తీవ్ర గాయాలవడంతో స్థానికులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక ప్రాణాలు కోల్పోయింది. దీనిపై కేసు నమోదు చేసిన మల్కాజిగిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భవనం పైనుంచి బిడ్డను విసిరేసిన తల్లి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



