Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అమ్మపాలు అమృతం..

అమ్మపాలు అమృతం..

- Advertisement -

శివరాణి, సూపర్వైజర్.. కాటారం సెక్టార్ (ఐసిడిఎస్ ప్రాజెక్టు మహాదేవపూర్) 
నవతెలంగాణ – కాటారం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో గల ఎర్రగుంటపల్లిలో తల్లిపాల వారోత్సవాలలో భాగంగా శనివారం రోజున అంగన్వాడి సెంటర్ లో తల్లులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో తల్లులకు  పుట్టిన రోజు నుండి 6 నెలల పిల్లలకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టించాలి. ఎట్టి పరిస్థితుల్లో  వాటర్  పట్టించకూడదని వారికి వివరించడం జరిగినది. 

తల్లిపాలలోనే  85% శాతం వాటర్  ఉంటుంది.కనుక పిల్లలకు ఎటువంటి ద్రవపదార్థాలు తాగించకూడదని, అలాగే పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టించాలి. ముర్రు పాలు పట్టడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వివరించడం జరిగింది. పిల్లలని ఎప్పటికప్పుడు బరువులు తీసి వారి పోషణ స్థితి ఎలా ఉందో తెలుసుకొని టీచర్ ఇచ్చే సలహాలను, సూచనలను పాటిస్తూ ఉండాలని వివరించడం జరిగింది. కార్యక్రమం అనంతరము అన్నప్రాసన, అక్షరాభ్యాసము చేపించడం జరిగినది. ఈ కార్యక్రమంలోని కాటారం సెక్టార్ సూపర్వైజర్ శివరాణి, అంగన్వాడీ టీచర్ ప్రేమలత, తల్లులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad