Monday, June 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అమ్మ బాట..అంగన్ వాడి బాట.!

అమ్మ బాట..అంగన్ వాడి బాట.!

- Advertisement -

నవతెలంగాణ- మల్హర్ రావు
అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడానికి రాష్ట్ర మహిళబివృద్ది శిశుసంక్షేమశాఖ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో మండలంలోని తాడిచర్ల, మల్లారం, పెద్దతూoడ్ల, నాచారం, ఆన్ సాన్ పల్లి, కొండంపేట, వళ్లెంకుంట తదితర గ్రామాల్లోని అంగన్ వాడి కేంద్రాల్లో అమ్మమాట..అంగన్ వాడి బాట కార్యక్రమాలను సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి  ఆధ్వర్యంలో మంగళవారం విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ వైజర్ మాట్లాడారు  పౌష్టికాహారంతో పాటు ఆట పాటలతో నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు,తల్లిదండ్రులు బడీడు పిల్లలను అంగన్వాడీల్లో చేర్పించాలన్నారు. అంగన్ వాడీ సెంటర్లో ప్రతి పిల్లవాడు అంగన్వాడీ కేంద్రాల్లోనే చదివే విధంగా టీచర్లు, పిల్లల తల్లిదండ్రులు సహకరించాలన్నారు. ఆరోగ్యపరంగా కిశోర బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్త లపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్లు, ఆయాలు, తల్లిదండ్రులు, చిన్నారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -