Friday, June 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్నూర్ లో అమ్మ మాట.. అంగన్వాడి బాట

మద్నూర్ లో అమ్మ మాట.. అంగన్వాడి బాట

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : మద్నూరు అంగన్వాడి సెంటర్లో సూపర్వైజర్ మేడం ఆధ్వర్యంలో అమ్మమాట.. అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా సూపర్వైజర్ మాట్లాడుతూ.. అంగన్వాడి సెంటర్లో ఆటపాట ద్వారా విద్య నేర్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రయివేట్ స్కూల్ కు దీటుగా అంగన్వాడి సెంటర్లో ఆటపాటలు  నేర్పించడం జరుగుతుంది. నూతన విద్యా విధానంలో భాగంగా డ్రాయింగ్ బుక్స్ ,పాటలు, ఆటలు ,కథలు, సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు. ప్రతి నెలలో నాలుగో శనివారం ఈ సి సి డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందనిపిల్లలకు నేర్పించే  ఆటపాటలకు సంబంధించిన విషయాలపై కార్యక్రమంలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ తో పాటు, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం, అంగన్వాడి టీచర్ ,అంగన్వాడీ ఆయా ,తల్లులు ,గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు పాల్గొనడం జరిగింది . ఈ కార్యక్రమాన్ని చిన్న ఎక్లేరా గ్రామంలో అదే విధంగా  ప్రతి అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుందని. అక్షరాభ్యాసం కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతున్నాయని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -