Saturday, November 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పదవ తరగతి విద్యార్థులకు ప్రేరణ సదస్సు

పదవ తరగతి విద్యార్థులకు ప్రేరణ సదస్సు

- Advertisement -

నవతెలంగాణ -భిక్కనూర్
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు శ్రీ కావ్య విద్య విషయక సమైక్య నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ప్రేరణ సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న పదవ తరగతి పరీక్షలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసి అవగాహన కల్పించారు. రాగి జావా తాగడానికి 150 స్టీల్ గ్లాసులు విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం నో బ్యాగ్ డే సందర్భంగా విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -