Monday, January 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జాంబవ హక్కుల సాధన సమితి నూతన సంఘం కరపత్రం ఆవిష్కరించిన మోత్కుపల్లి

జాంబవ హక్కుల సాధన సమితి నూతన సంఘం కరపత్రం ఆవిష్కరించిన మోత్కుపల్లి

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు టౌను
జాంబవ హక్కుల సాధన సమితి నూతన సంఘం కరపత్రాన్ని మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నర్సింహులు సోమవారం, ఆలేరుకు చెందిన సంఘం సభ్యులతో కలిసి హైదరాబాద్ బేగంపేటలోని ఆయన నివాసంలో ఆవిష్కరించి మాట్లాడారు. మాదిగ, మాదిగ ఉపకులాల కవులు, రచయితలు, గాయకులు, డప్పు కళాకారులు, చిందు, బుడిగే, బైండ్ల (భాగోతం) కళాకారుల జీవన పోరాటంలో భాగంగా ఈ సంఘం ఆవిష్కరణ  జరిగిందన్నారు. ఈ సంఘాన్ని బైరపాక స్వామి జాంబవ్ స్థాపిండం పట్ల ఆయనకు మంచి భవిష్యత్తు ఉందన్నారు. రానున్న రోజుల్లో ఆ సంఘం హక్కుల సాధన కొరకు పోరాటం దృడంగా చేయాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమంలో ఆ సంఘం ముఖ్య సలహాదారులు యువకవి, రచయిత బైరపాక స్వామి, నాయకులు పల్లె శ్రీను జాంబవ్, సంగి నవీన్ జాంబవ్,  బైరపాక యాదయ్య జాంబవ్, బైరపాక రాములు జాంబవ్, కొల్లూరి శ్రీకాంత్ జాంబవ్, ఏలూరి ప్రవీణ్ జాంబవ్, ఎర్ర రమేష్ జాంబవ్, సుంచు బాలకృష్ణ జాంబవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -