నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని నాగాపూర్ సర్పంచ్ కొంపదండి అశోక్ ను తెలంగాణ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మోటార్ రివైండింగ్ యూనియన్, మండల మోటార్ రివైండింగ్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ మేరకు ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ కంపదండి అశోక్ ను మోటార్ రివైండింగ్ యూనియన్ సభ్యులు శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా మండల మోటార్ రివైండింగ్ యూనియన్ అధ్యక్షులు జాగిర్యాల నవీన్ మాట్లాడుతూ.. తమ తోటి మెకానిక్ నాగాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా గెలుపొందడం మెకానికులుగా తమకు ఎంతో గర్వకారణం అన్నారు.
భవిష్యత్తులో కూడా సర్పంచ్ అశోక్ రాజకీయాల్లో రాణించి ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. గ్రామ సర్పంచ్ గా ఉత్తమ సేవలందించి ప్రజల మన్నలను పొందాలన్నారు. కార్యక్రమంలో మోటార్ రివైండింగ్ యూనియన్ మండల ప్రధాన కార్యదర్శి దయాకర్, కోశాధికారి చింత సత్యపాల్, సలహాదారులు కాలేరు గంగాధర్, జిందం శ్రీనివాస్, యాట గంగాధర్, సభ్యులు జిందా హరికృష్ణ, కొవ్వూరి రాకేష్, మారుపాక బాలకిషన్, ఆకుల రాజు, బొంతల రాజు, దుబ్బాక ధర్మేందర్, మోహన్, రాజశేఖర్, ఈర్ల గంగాధర్, గణేష్, నరేష్, గంగారం, భాస్కర్, రాజా ముత్యం, తదితరులు పాల్గొన్నారు.



