– అనధికార స్పీడ్ బ్రేకర్లు, గుంతలతో ఇబ్బందులు
– అవసరం మేరకే స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలంటున్న పట్టణవాసులు
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలో రోడ్లపై తిరగాలంటే వాహనాలు దెబ్బతింటున్నాయని పలువురు వాహనదారులు పేర్కొంటున్నారు. కొన్ని గల్లీలలో మున్సిపల్ పర్మిషన్ లేకుండా మున్సిపల్ అధికారులకు తెలియకుండానే తమ ఇష్టం వచ్చినట్టుగా స్పీడ్ బ్రేకర్లను నిర్మించడంతో తమ వాహనాలు దెబ్బతింటున్నాయని, చూసుకోకుండా వస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని పలువురు వాహనదారులు పేర్కొంటున్నారు.
స్పీడ్ బ్రేకర్లు నియమించుకోవాలంటే కొన్ని నిబంధనలు
మున్సిపల్ పరిధిలోని ప్రజలు తమతమ ఇంటి వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసుకోవాలంటే కొన్ని నిబంధనలను పాటించవలసి ఉంటుంది. అలాంటిది కామారెడ్డి పట్టణంలో కొందరు తమ ఇష్టం వచ్చినట్లుగా స్పీడ్ బ్రేకర్లు నిర్మిస్తున్నారు. మునిసిపాలిటీ పరిధిలో ఇంటి వద్ద, వీధిలో స్పీడ్ బ్రేకర్ (వేగ నిరోధకం) ఏర్పాటు చేయించాలంటే కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రజల భద్రత దృష్ట్యా, ట్రాఫిక్ నిబంధనల ప్రకారం వీటిని ఏర్పాటు చేస్తారు.
అనుసరించాల్సిన దశలు ఇక్కడ ఉన్నాయి.
1. వినతి పత్రం సిద్ధం చేయడం (The Application)
ముందుగా ఒక తెల్ల కాగితంపై మునిసిపల్ కమిషనర్ కు వినతి పత్రం రాయాలి. అందులో ఈ క్రింది విషయాలు స్పష్టంగా ఉండాలి, స్పీడ్ బ్రేకర్ ఎక్కడ అవసరమో ఆ ఖచ్చితమైన చిరునామా ప్రాంతం. అక్కడ స్పీడ్ బ్రేకర్ ఎందుకు వేయించాలనుకుంటున్నారో దానికి గల కారణాలు (ఉదా: వాహనాలు అతివేగంగా వెళ్లడం, పిల్లలు, వృద్ధులు రోడ్డు దాటడానికి ఇబ్బంది పడటం, లేదా గతంలో జరిగిన ప్రమాదాలు).
2. స్థానికుల సంతకాలు (Community Support)
ఒక్కరే వెళ్లే కంటే, ఆ వీధిలోని లేదా కాలనీలోని కనీసం 10 – 15 మంది నివాసితుల సంతకాలను ఆ వినతి పత్రంపై సేకరించాలి. దీనివల్ల సమస్య తీవ్రత అధికారులకు అర్థమవుతుంది. 3. వినతి పత్రాన్ని సమర్పించడం, సిద్ధం చేసిన దరఖాస్తును మీ పట్టణ మునిసిపల్ కార్యాలయంలో (Municipal Office) అందజేయాలి. మీ వార్డు కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి, వారి నుంచి ఒక ‘లెటర్ ఆఫ్ రికమండేషన్’ (సిఫార్సు లేఖ) తీసుకుంటే పని త్వరగా అవుతుంది.
4. తనిఖీ మరియు ఆమోదం
మీరు దరఖాస్తు ఇచ్చాక, మునిసిపల్ ఇంజనీరింగ్ విభాగం వారు ఆ స్థలాన్ని పరిశీలిస్తారు. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసుల అనుమతి కూడా అవసరమవుతుంది. రహదారి భద్రతా నిబంధనల (IRC Standards) ప్రకారం అక్కడ స్పీడ్ బ్రేకర్ వేయవచ్చా లేదా అని వారు నిర్ణయిస్తారు. సొంతంగా సిమెంట్ లేదా రాళ్లతో స్పీడ్ బ్రేకర్లు నిర్మించడం చట్టవిరుద్ధం. దీనివల్ల ప్రమాదాలు జరిగితే మీపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ మునిసిపాలిటీ ద్వారానే చేయించడం ఉత్తమం. పట్టణంలో కొందరు ఇవేమీ లేకుండానే తమ ఇష్టార్జిగా పిడిబి కలర్ నియమిస్తూ వాహనదారులకు ఇబ్బందిని కలిగిస్తున్నారు. వీటిపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు వాహనదారులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. ఈ విషయంపై మున్సిపల్ డి ఈ ఈ హనుమంతరావు వివరణ కోరగా వారికి అక్కడ నుండి వెళ్లే వాహనాల వల్ల ఇబ్బంది కలిగిందేమో వేసుకున్నారేమో, మున్సిపల్ పరిధిలో గల్లీలో వేస్తేనే మా పరిధిలోకి వస్తుంది అంటూ ముట్టి ముట్టనట్టు, ఆంటీ అంట నట్టు సమాధానం చెప్పారు.
మున్సిపల్ అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్లను తొలగించాలి ( వాహనదారుడు )
పట్టణంలో కొన్నిచోట్ల గుంతలు ఉంటే మరికొన్నిచోట్ల ఎలాంటి పర్మిషన్ లేకుండా కొందరు విస్టా రీతిగా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో వాహనాలు దెబ్బతింటున్నాయి. మున్సిపల్ అధికారులు స్పందించి వాటిని అవసరం లేని చోట తొలగించి, అవసరం ఉన్నచోట వాహనాలకు ఇబ్బంది లేకుండా చూడాలి.
ఇంటి వద్ద స్పీడ్ బ్రేకర్ వేసుకోవాలంటే ముందుగా మున్సిపల్ లో దరఖాస్తు చేసుకోవాలి ( మున్సిపల్ ఇంజనీర్ హనుమంతరావు )
ఎవరికైనా వారి ఇంటి ముందు నుండి వాహనాలు వెళ్తే వారికి ఇబ్బంది కలుగుతే ఆ ఇబ్బందిని తొలగించడానికి మున్సిపల్ అధికారులకు ముందస్తుగా స్పీడ్ బ్రేకర్ వేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోవాలి.



