Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంస్థానిక సమస్యలపై ఉద్యమం

స్థానిక సమస్యలపై ఉద్యమం

- Advertisement -

– కాంగ్రెస్‌ హామీలను అమలు చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ – రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి

స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఉద్యమాలు చేపట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో శనివారం సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సామేల్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాన్‌వెస్లీ, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలను గుర్తించి, పరిష్కారానికి పోరు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరించిందన్నారు. దీనిపై స్థానికంగా ఎమ్మెల్యేలను నిలదీయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. భూముల సమస్య పరిష్కారం కోసం ధరణి పేరుతో నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దగా చేసిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం భూ భారతి పేరుతో ఆర్‌ఓఆర్‌ చట్టం తీసుకొచ్చిందని, కనీసం భూ భారతితోనైనా రైతుల సమస్యలు తీరుతాయని ఆశిస్తే ఫలితం లేకుండా పోయిందన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కాడిగళ్ల భాస్కర్‌, ఎం.చంద్రమోహన్‌, ఈ.నర్సింహా, డి.జగదీశ్‌, జి.కవిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad