Tuesday, May 13, 2025
Homeసినిమాభిన్న కాన్సెప్ట్‌తో నయా సినిమా

భిన్న కాన్సెప్ట్‌తో నయా సినిమా

- Advertisement -

ఎన్టీఆర్‌ ముని మనవడు, హరికష్ణ మనవడు, జానకిరామ్‌ తనయుడైన నందమూరి తారక రామారావు ఫిలిమ్స్‌లోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇస్తున్నారు. వైవిఎస్‌ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ని న్యూ టాలెంట్‌ రోర్స్‌ ఏ బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు. ఈ సినిమా గ్రాండ్‌ ముహూర్తం చిత్రీకరణ సోమవారం ఎన్టీఆర్‌ ఘాట్‌లో వైభవంగా జరిగింది.
ఈ ప్రారంభోత్సవ వేడుకకు గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో, హీరోయిన్లపై నారా భువనేశ్వరి క్లాప్‌ కొట్టారు. దగ్గుబాటి పురందేశ్వరి కెమెరా స్విచాన్‌ చేశారు. లోకేశ్వరి గౌరవ దర్శకత్వం వహించగా, నందమూరి సుహాసిని, నందమూరి మోహన్‌ రూప, శ్రీమంతిని, నందమూరి వసుంధర బాలకష్ణ, దగ్గుబాటి నివేదిత, నందమూరి దీపిక, చలసాని చాము, నంద మూరి జయశ్రీ, నందమూరి లక్ష్మీ హరికష్ణ, కంటమెన్ని దీక్షిత స్క్రిప్ట్‌ని అందించారు. నందమూరి మోహన్‌ కష్ణ డీవోపీ చేశారు. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు ఇండిస్టీ ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
డైరెక్టర్‌ వైవిఎస్‌ చౌదరి మాట్లాడుతూ,’ఇది ఒక మిసైల్‌ లాంచింగ్‌లా అనిపిం చింది. ఇది మరపురాని ఘట్టం. తారకరామారావు సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించడం నా అదష్టంగా భావిస్తు న్నాను. తెలుగు సాహిత్యం, తెలుగు సంప్రదాయం హైందవ సంస్కతి నేపథ్యంలో నా శాయశక్తుల కష్టపడి ఒక మంచి కథని తయారు చేశాను. ఆ కథ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
‘ఈ కార్యక్రమానికి విచ్చేసిన నందమూరి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. మీ అందరి ఆశీర్వాదంతో ఈ సినిమాని విజయవంతంగా రిలీజ్‌ చేస్తామని నమ్ముతున్నాం’ అని నిర్మాత యలమంచిలి గీత చెప్పారు.
హీరోయిన్‌ వీణ రావు మాట్లాడుతూ,’మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు ఉండాలి. ప్రేక్షకులు మా సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. హీరో నందమూరి తారక రామారావు మాట్లాడుతూ,’నా కుటుంబ సభ్యులందరూ నన్ను ప్రోత్సహించడానికి ఇక్కడికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రేక్షకుల ప్రేమాభిమానాలే నన్ను ముందుకు నడిపిస్తాయని నమ్ముతున్నాను’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -