Tuesday, May 13, 2025
Homeఖమ్మంఅటవీ ప్రాంతంలో ఎంపీ, ఎమ్మెల్యేల పర్యటన..

అటవీ ప్రాంతంలో ఎంపీ, ఎమ్మెల్యేల పర్యటన..

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట: ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణలు సోమవారం మండలంలోని పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రామీణ ఉపాధి హామీ నిధులతో, పంచాయితీ రాజ్ పర్యవేక్షణలో రూ.1 కోటీ 7 లక్షల 20 వేల వ్యయంతో పేరాయిగూడెం, కన్నాయిగూడెం పంచాయితీల్లో నిర్మించిన డ్రైనేజీ కాలువలు, సీసీ రోడ్లు ను వారు ఇరువురు ప్రారంభించారు. ముందుగా నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట పట్టణంలో రోడ్డు పక్కన ఓ చిన్న హోటల్ లో ఎంపీ రామ సహాయం, ఎమ్మెల్యే జారే లు అల్పాహారం(దోసె టిఫిన్ ) చేసారు. అనంతరం అశ్వారావుపేట మున్సిపాల్టీ పరిధిలోని పేరాయిగూడెం(ఏఎస్ ఆర్ నగర్) నుండి కన్నాయిగూడెం పంచాయితీ (చెన్నాపురం),గుబ్బల మంగమ్మ ఆలయం వరకు పూర్తిగా వీరి పర్యటన దట్టమైన అటవీ ప్రాంతంలో కొనసాగింది. కావడి గుండ్ల లో అరుగు పైనే కూర్చొని గిరిజనుల దగ్గర నుండి అర్జీలు స్వీకరించారు. చెన్నాపురం గ్రామంలో గ్రామ సెంటర్ లో సీ సీ రోడ్లను ప్రారంభించి, అక్కడ నేలపై వేసిన పట్టా పై కింద కూర్చొని ఆదివాసీల యోగక్షేమాలు తెలుసుకుని రచ్చబండ నిర్వహించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి తన లక్ష్యమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వేలాది కోట్లను హెచ్చిస్తుందని చెప్పారు. వీటిని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గుబ్బల మంగమ్మ దేవాలయం దర్శించుకుని అక్కడే దట్టమైన అటవీ ప్రాంతంలో మధ్యాహ్నం భోజనం చేసారు. ఈ సందర్భంగా అక్కడ గిరిజనులు దట్టమైన అటవీప్రాంతంలో గల తమ గ్రామాలకు వచ్చి,నిధులు కేటాయించి అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ రామ సహాయం రెడ్డికి ఆయా గ్రామాల ఆదివాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతవరకు యే ఎంపీ తమ వద్దకు రాలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్, మండల ప్రత్యేక అధికారి, పశుసంవర్ధక శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ ప్రదీప్ కుమార్, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, పంచాయితీ రాజ్, మిషన్ భగీరథ, ఆర్ అండ్ బీ డీఈఈ, ఏఈఈ లు శ్రీధర్, అక్షిత, సలీం, సతీష్ కుమార్, ప్రకాష్, రాకేష్, కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్, తుమ్మ రాంబాబు, మిండ హరిబాబు, కానూరి మోహన్ రావు, కొల్లు చంద్రశేఖర్, కొనకళ్ళ చెన్నారావులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -