Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రవాస భారతీయ దివస్ అవార్డుల ప్రధాన ఉత్సవంలో ఎంపీ చామల

ప్రవాస భారతీయ దివస్ అవార్డుల ప్రధాన ఉత్సవంలో ఎంపీ చామల

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు 
ప్రవాస భారతీయ దివాస్ దినోత్సవ సందర్భంగా హైటెక్ సిటీలోని టెక్ మహీంద్రా ఆడిటోరియంలో శనివారం ప్రవాసి భారతీయ అవార్డుల ప్రధానోత్సవానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై వివిధ రంగాలలో సేవలందించిన వారికి అవార్డుల ప్రధానం చేశారు. ఈ సందర్భంగా నవతెలంగాణతో మాట్లాడుతూ.. ప్రపంచంలో ఏ మూలన ఉన్న ప్రవాస భారతీయుల గుండెచప్పుడు మాత్రం భారతదేశం సంస్కృతి సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. హాజరైన సమికులనందరిని ఉద్దేశించి ప్రవాస భారతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

1915లో దక్షిణాఫ్రికా నుండి మహాత్మా గాంధీ జనవరి 9న భారతదేశానికి తిరిగి వచ్చారు. దేశ స్వతంత్రం కోసం అహర్నిశలు తపించి ఎన్నో త్యాగాలు చేసిన అనంతరం స్వాతంత్రం సిద్ధించాక మతోన్మాది గాడ్సే చేతుల్లో  హత్య గావించబడ్డాడు. భారత దేశ స్వాతంత్రం కోసం దక్షిణాఫ్రికా నుండి జనవరి 9 తేదీన మాత్మ గాంధీ భారతదేశానికి కాలుమోపిన సందర్భంగా ప్రవాస భారతీయ దినోత్సవం వేడుకల జరుపుకోవడం ఎన్నారై లకు కర్తవ్యం గా మారిందన్నారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల కృషిని గౌరవిస్తూ 2003 నుండి జరుగుతున్న ఈ ప్రోగ్రాం ని నాన్ రెసిడెన్స్ ఇండియన్ (n r  i) దినోత్సవం పేరుతో కూడా పిలుస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మలిచేటి రాజీవ్ రెడ్డి ఎన్నారై అడ్వైజరి చైర్మన్ బి వినోద్ కుమార్, సలహా కమిటీ. వైస్ చైర్మన్ మంద భీమ్ రెడ్డి ఎన్ దేవేందర్ రెడ్డి, ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -