నవతెలంగాణ- ఆలేరు
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డులలో రూ.12 కోట్లతో అభివృద్ధి పనులకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. శుక్రవారం నవతెలంగాణతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి లక్ష్యంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందన్నారు.
రైతులు మహిళలు యువత కార్మికులు ముఖ్యంగా పేద వర్గాల అభివృద్ధి లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు జరుగుతుందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఐక్యమత్యంగా ఉండి ప్రతి ఒక్క ఓటర్ ను కలిసి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు గూర్చి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో చిట్యాలలో 12 వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలన్నారు.
స్థానిక బి ఆర్ ఫంక్షన్ హాల్ లో మున్సిపాలిటీ మండలంలోని కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. చిట్యాల మాజీ సర్పంచ్ గుండెబోయిన శ్రీ లక్ష్మీ సైదులు తో పాటు 200 మంది పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, మదర్ డైరీ చైర్మన్ గుత్త అమిత్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు జడల చిన్న మల్లయ్య, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కాట వెంకన్న, మండలంలోని సర్పంచులు, వార్డు మెంబర్లు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



