నవతెలంగాణ – ఆలేరు
సిద్దిపేట జిల్లాలోని దూల్మిట్ట మండలం భైరన్ పల్లి గ్రామాన్ని వీర భైరన్ పల్లిగా మార్చాలని భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి శనివారం హైదరాబాదులోసీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..ఇటీవల జరిగిన సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ వియోచన దినోత్సవం సందర్బంగా భైరన్ పల్లి గ్రామంలోని రజాకార్ల దాడిలో విరోచితంగా పోరాడి అమరులైన వారి కి నివాళులర్పించి రూ,10 లక్షలు స్తూపం,బురుజు అభివృద్ధి కోసం ఇచ్చినట్లు తెలిపారు.గ్రామ ప్రజల కొరికా మేరకు భైరన్ పల్లి గ్రామాన్ని విర భైరన్ పల్లి గ్రామంగా పేరు మార్చాలని తమ దృష్టికి తీసుకురాగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి గ్రామ ప్రజల కోరిక నెరవేర్చే విధంగా కృషి చేస్తానన్నారుగ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీ పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డీ వివరిస్తూ.. మనకు 1947 ఆగస్టు 27న సిద్ధిపేట జిల్లా, దూల్మిట్ట మండలం, బైరాన్‌పల్లి గ్రామంలో జరిగిన విషాదకరమైన మరియు చారిత్రాత్మక సంఘటనను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పారు. తెలంగాణ చరిత్రలో చీకటి అధ్యాయాలలో ఒకటిగా మిగిలిపోయిందని తెలిపారు. నిజాం పాలనలో, రజాకార్లు దారుణాలకు పాల్పడ్డారని, డబ్బు వసూలు చేయడమే కాకుండా అమాయక గ్రామస్తులను వేధించారని గుర్తుచేశారు.ఈ దురాగతాలను ఎదిరించి తమ గ్రామాన్ని రక్షించుకోవడానికి బైరన్‌పల్లి ప్రజలు ఒక రక్షణ బృందాన్ని ఏర్పాటు చేసారని, ప్రతీకారంగా, రజాకార్లు గ్రామాన్ని ఐదుసార్లు చుట్టుముట్టి క్రూరమైన దాడులకు దిగారని తెలిపారు
చివరి దాడిలో, దాదాపు 1,200 మంది రజాకార్లు గ్రామంపై దాడి చేసి, 126 మంది అమాయక గ్రామస్తులను నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోశారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ దాడిలో మహిళలు కూడా తీవ్ర దారుణాలకు గురయ్యారన్నారు. ఈ ఊచకోతను ఆ సమయంలో జలియన్ వాలాబాగ్ విషాదం కంటే భయంకరమైనదిగా అభివర్ణించారు.బైరన్‌పల్లి గ్రామస్తుల ప్రతిఘటన మరియు త్యాగం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ధైర్యానికి చిహ్నంగా నిలుస్తాయి.గ్రామస్తుల అత్యున్నత త్యాగం మరియు పరాక్రమానికి గుర్తింపుగా, అమరవీరుల వీరోచిత వారసత్వాన్ని రాబోయే తరాలకు గుర్తుంచుకునేలా గ్రామం పేరును అధికారికంగా “వీర బైరన్ పల్లి”గా మార్చాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డీ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని అభ్యర్థించగా ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డీ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.