నవతెలంగాణ – ఆలేరు
న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో గురువారం పర్యావరణం సుస్థిరతపై జరుగుతున్న వర్క్ షాప్ లో భారతదేశం నుండి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడినట్లు నవతెలంగాణకు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ తో లక్షల కోట్ల నష్టం జరుగుతుందన్నారు. ముఖ్యంగా పంటలపై ప్రభావం ఎక్కువగా ఉందని చీడలు దిగుబడి సరిగా లేకపోవడం ఇలాంటి సమస్యలు కారణం గ్లోబల్ వార్మింగే అన్నారు. అనేక దేశాలలో కారు చిచ్చు వల్ల అడవులు నాశనం అవుతున్నాయని, సముద్రాల ఉప్పొంగి రాబోయే కాలంలో కొన్ని చిన్న చిన్న దేశాలు కనపడకుండా పోయే పరిస్థితి ఉందన్నారు. అంటార్కిటికా మంచు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి అన్నారు.
భూ ఉష్ణోగ్రతలు కూడా పెరిగి కొన్ని జీవులు మనగడ ప్రమాదంలో పడిందన్నారు. మొదటి రోజు వర్క్ షాప్ లో తనతో పాటు స్వ నితి ఇనిషియేటివ్ సీఈవో రిత్విక భట్టాచార్య ప్రసంగంతో ప్రారంభమైంది అన్నారు. వాతావరణ మార్పులు ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా ఎదుర్కొన్నప్పుడే పరిష్కారం దొరుకుతుందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు డి కార్బోనేజేషన్ పై దృష్టి పెట్టాలన్నారు. అంటే దేశాలు స్థిరమైన అభివృద్ధి వైపు ముందుకు సాగేందుకు అనుసరించాల్సిన ముఖ్య విషయాలపై విస్తృతంగా చర్చ జరిగిందన్నారు. ఈ వర్క్ షాప్ లో ప్రతినిధులుగా అనురాగ్ ఠాకూర్ సౌత్ వరల్డ్ పార్లమెంటేరియన్ లు ఈడెన్, బ్రీయ స్క్లాడర్ ఉప గవర్నర్ ఇల్లి నాయిస్,డాక్టర్ మొహమ్మద్ సల హూద్దీన్,రహమత్ కైముద్దీన్ ఇల్ ప్యూ హంగ్ పాల్గొన్నట్లు చెప్పారు.