Friday, November 7, 2025
E-PAPER
Homeజాతీయంనకిలీ కేవైసీతో ఎంపీకి రూ.56 లక్షలు టోకరా

నకిలీ కేవైసీతో ఎంపీకి రూ.56 లక్షలు టోకరా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించి, ఆయన ఖాతా నుంచి రూ.56 లక్షలు దోచుకున్నారు. నకిలీ పాన్, ఆధార్ కార్డులతో కేవైసీ అప్‌డేట్ చేసి, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మార్చి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ నేరానికి పాల్పడ్డారు. దోచుకున్న సొమ్మును వేర్వేరు ఖాతాలకు బదిలీ చేసి, బంగారం కొనుగోలు చేశారని, కొంత మొత్తాన్ని ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసుకున్నారని సమాచారం. బ్యాంకు ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -